ఇన్సూరెన్స్‌ ప్రీమియం, క్రెడిట్ కార్డ్స్ మొదలు గ్యాస్ సిలెండర్ల వరకు జనవరి ఒకటి నుండి మారనున్న అంశాలివే..!

-

ప్రతి నెల ఒకటి తేదీ వచ్చేసరికి కొన్ని రూల్స్ వస్తూ ఉంటాయి. కొన్ని అంశాలు మారుతూ ఉంటాయి. ప్రతీ నెలా కూడా ఏదో ఒక కొత్త నిబంధన అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఎక్కువగా ప్రతీ నెలా కూడా గ్యాస్‌ సిలిండర్‌, ఆదాయపు పన్ను, ఇన్సూరెన్స్ వంటి అంశాల్లో మార్పులు వస్తూ ఉంటాయి.

ఈ ఏడాది ఇక పూర్తి అయ్యిపోతోంది. ఇప్పుడు ఇక కొత్త ఏడాది రానుంది. 2023 జనవరి 1 నుంచి కొత్త రూల్స్‌ అమలు లోకి రానున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలలో జనవరి 1 నుంచి మార్పులు రానున్నాయి. వచ్చే సంవత్సరం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నందున ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా కొన్ని మార్పులు రానున్నాయి.

వాహనాల నంబర్‌ ప్లేట్‌కు హైసెక్యూరిటీ:

హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేటు ని జనవరి ఒకటి నుండి తీసుకు రానున్నారు. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ప్లేట్‌లు ఉంటే ఏ ఇబ్బంది రాదు. చేయించుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ లేకపోతే రూ.5వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది.

క్రెడిట్ కాట్స్ రివార్డ్ పాయింట్లు:

జనవరి 6, 2023 నుంచి ఎస్‌బీఐ సింప్లి క్లిక్ క్రెడిట్ కార్డు యూజర్లకు జారీ చేసే క్లియర్ ట్రిప్ వోచర్ ని ఎక్కువ సార్లు రీడిమ్ చేసుకునే వీలు లేకుండా కేవలం ఒక్కసారి మాత్రమే రిడీమ్ చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంది. పైగా ఈ వోచర్ ఏ ఇతర వోచర్ల తోనూ, ఆఫర్లతోనూ కలిపి రాదు. జనవరి 01, 2023 నుంచి అమెజాన్ వెబ్ సైట్ లో ఈ కార్డు ని వాడితే వచ్చే రివార్డు పాయింట్లను తగ్గించేసింది. ఈసారి పది రావు. కేవలం ఐదు పాయింట్లే వస్తాయి.

ఇన్సూరెన్స్‌ ప్రీమియం:

ఇన్సూరెన్స్‌ ప్రీమియం ని పెంచాలని చూస్తున్నారు. జనవరి 1 నుంచి ఇన్సూరెన్స్‌ ప్రీమియం మరింత పెరగనుంది. రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వాళ్ళు ఈ-ఇన్‌వాయిసింగ్‌ తప్పకుండా జనరేట్‌ చేసుకోవాలి. జనవరి 1 నుంచి ఇది తప్పనిసరి చేయనున్నారు.

గ్యాస్‌ ధరలు:

ప్రతి నెల తొలి వారంలో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరల్ని మారుస్తారు. ఈసారి కూడా అలానే మార్పులు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news