తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలవడంతో ప్రత్యర్థులకు దిమ్మతిరిగిపోయే విధంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో రాకపోవటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలు కెసిఆర్ పై రెచ్చిపోయాయి. మరోపక్క కెసిఆర్ తెలంగాణ క్యాబినెట్ విస్తరణ చేయనున్నట్లు ఎప్పుడో ప్రకటించడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటడంతో కెసిఆర్ గతంలో ప్రకటించిన క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు చేస్తారో అని తెలంగాణ మొత్తం ప్రస్తుతం ఎదురుచూస్తోంది. అయితే క్యాబినెట్ విస్తరణ అంశం గురించి పార్టీలో కనీసం తన కొడుకు కేటీఆర్ కి కూడా డేట్ తెలియకుండా పగడ్బందీగా కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ కార్యక్రమాన్ని చేయబోతున్నట్లు సమాచారం.
ముఖ్యంగా క్యాబినెట్ విస్తరణ పై టిఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఆశావహులు తమకి మంత్రివర్గంలో చోటు వస్తుందని ఆశిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకుల పని తీరుపై ఎవరికీ తెలియకుండా కేసీఆర్ సర్వే చేయించినట్లు దీంతో ఆ సర్వే పార్టీ త్వరలోనే కేసీఆర్ స్వయంగా తెలంగాణ క్యాబినెట్ విస్తరించడానికి పునుకోబోతున్నట్లు సమాచారం.