ఏపీ స్పీకర్‌పై టీటీడీపీ నేత సంచలన ఆరోపణలు..డిగ్రీ లేకుండా లా!

-

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తమ్మినేని డిగ్రీ పూర్తి చేయకుండా లా చేయడానికి ఎలా అప్ప్లై చేశారని ఫైర్ అయ్యారు.  అసలు డిగ్రీ మధ్యలోనే ఆపేసిన తమ్మినేని మూడేళ్ల ‘లా’  కోర్సులో అక్రమంగా చేరారని, చాలా ఇంటర్వ్యూల్లో డిగ్రీ మధ్యలోనే ఆపేసినట్లు స్వయంగా ప్రకటించుకున్న తమ్మినేని.. లా కోర్సులో ఏ అర్హతతో చేరారని ఆయన ప్రశ్నించారు.

అయితే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీతారామ్‌కు ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు ఏమైనా మినహాయింపు ఇచ్చారా? అని నిలదీశారు. 2019 ఎన్నికల్లో గెలిచి ఏపీ స్పీకర్ అయిన తర్వాత ఉన్నత చదువు కోసం తమ్మినేని..హైదరాబాద్ ఓయూ పరిధిలోని మహాత్మాగాంధీ లా కాలేజీలో ఎల్ఎల్‌బీ అడ్మిషన్ తీసుకున్నారని చెప్పుకొచ్చారు.

TDP Leader

కానీ మూడేళ్ల ఈ కోర్సు చదవాలంటే డిగ్రీ పాసై ఉండాలి. లేదంటే డిగ్రీకి సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలి. కానీ అవేమీ చేయకుండా డిగ్రీ మధ్యలో ఆపేసిన తమ్మినేని ఎల్ఎల్‌బీ మూడేళ్ల కోర్సులో అడ్మిషన్ ఎలా పొందారనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయిందన్నారు. ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో ఆయన ఇంటర్ పూర్తి చేసి..డిగ్రీ అసంపూర్తిగా వదిలేసినట్లు చెప్పారు.

అలాగే 2019 ఎన్నికల ఆఫడవిట్ లో కూడా  డిగ్రీ పూర్తి చేయలేదనే పెట్టారు. మరి ఆ వెంటనే ఎల్‌ఎల్‌బి కోర్సుకు ఎలా అప్ప్లై చేశారని టి‌డి‌పి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అలాగే డిగ్రీ సర్టిఫికేట్ ఏ విధంగా సంపాదించారో తమ్మినేని చెప్పాల్సిన అవసరం ఉందని నన్నూరి అంటున్నారు. అంటే డిగ్రీ పై టి‌డి‌పి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తమ్మినేని ఎల్‌ఎల్‌బి కోర్సు కాస్త వివాదంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news