TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో 10 మంది అరెస్ట్..

-

టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఓవైపు సిట్.. మరోవైపు ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపింది. ఈ విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలతో మరి కొందరిని అరెస్టు చేసింది.

అయితే తాజాగా ఈ కేసులో మరికొంత మందిని అరెస్ట్‌ చేశారు అధికారులు. టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ కేసులో మరో 10 మంది అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఇప్పటికే 74 మందిని అరెస్టు చేశారు సిట్ పోలీసులు. నిందితులు విచారణలో ఇచ్చిన సమాచారం ఆధారంగా అరెస్టు చేస్తున్నారు పోలీసులు. ఇక మరికొంత మందిని అరెస్టు చేసేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు సిట్‌ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news