కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీస్తున్న యూసీసీని వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. దేశాభివృద్ధిని విస్మరించి విద్వేష రాజకీయం కోసమే తెస్తున్న యూసీసీని వ్యతిరేకిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తేల్చేశారు. యూసీసీ వల్ల అన్ని మతాల ప్రజల్లో అయోమయం నెలకొంటుందన్నారు. యూసీసీ పేరుతో మరోసారి ప్రజలను విభజించేందుకు కుట్ర చేస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు.
బావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ఈ బిల్లును అడ్డుకుంటామని కెసిఆర్ స్పష్టం చేశారు. అయితే.. ఈ ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ కు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. ‘దేశ ప్రజల సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలన్న మా అభ్యర్థనను అర్థం చేసుకుని, తీవ్రంగా వ్యతిరేకించినందుకు దేశ ప్రజలందరి తరపున కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాం’ అని పేర్కొంది.