జీహెచ్ఎంసీ పరిధిలో 100 టీకా కేంద్రాలు

-

కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ కొవిడ్‌ టీకాలు వేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం… వ్యాక్సిన్‌ కేంద్రాలను కూడా పెంచుతుంది. ఇందులో భాగంగా తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ (జీహెచ్ఎంసీ) పరిధిలో 100 కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ వెల్లడించారు.

జీహెచ్ఎంసీ
జీహెచ్ఎంసీ

ఈ వ్యాక్సిన్‌ కేంద్రాల్లో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా కరోనా టీకా వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టీకా కేంద్రాలు తెరిచి ఉంటాయన్నారు. ఈ టీకా కేంద్రాలకు నేరుగా వెళ్ళిన టీకా వేస్తారు. అయితే కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని టీకా కేంద్రానికి వెళితే వేచి చూడాల్సిన అవసరం ఉండదని అర్వింద్‌ కుమార్‌ చెప్పారు. ప్రజలు తమ దగ్గర్లో ఉన్న కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకోవాలని ఆయన సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news