పదవ తరగతి పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ). వికారాబాద్ జిల్లా తాండూరు లో పదవ తరగతి తెలుగు పరీక్ష పేపర్ లీకైనట్లుగా ప్రచారం జరుగుతోంది. పరీక్ష ప్రారంభం అయిన గంటలోనే వాట్సప్ లో పేపర్ బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. లక్షలాది మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరైయారు.
వారికి ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది. ఈ లీకేజీపై సమగ్రమైన విచారణ జరిపించాలని విద్యాశాఖను ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది ఎస్ఎఫ్ఐ. మరోవైపు ఇదే కేసులో బంధప్ప అనే ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్కూల్ లో ఉన్న సైన్స్ టీచర్ బంధప్ప ఈ ప్రశ్న పత్రాన్ని వాట్సప్ ద్వారా బయటికి పంపించారని.. 9:37 గంటలకు పేపర్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టాడు బందప్ప. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.