తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అటు నిన్న శ్రీవారిని 69,270 మంది భక్తులు దర్శించుకున్నారు.
28,755 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.74 కోట్లుగా నమోదు అయినట్లు టీటీడీ ప్రకటించింది. ఇక అటు తిరుమలలో ఈ నెల 21వ తేదిన గరుడ పంచమి సందర్భంగా గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. ఆ రోజున రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. అలాగే, ఈ నెల 26వ తేదిన పవిత్రోత్సవాలుకు అంకురార్పణ జరుగనుంది. ఈ నెల 27 నుంచి 29 వ తేది వరకు మూడు రోజులు పాటు పవిత్రోత్సవాలను నిర్వహించనుంది టిటిడి.