TELANGANA : లంపీస్కిన్ వ్యాధి కట్టడికి రూ.15 కోట్లు మంజూరు

-

దేశవ్యాప్తంగా లంపీస్కిన్ వ్యాధి పశువులపై పంజా విసురుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తూ పాడి పశువుల ప్రాణాలు బలితీసుకుంటోంది. మొన్నటి వరకు ఉత్తర భారతంలోనే వ్యాపించిన ఈ వ్యాధి ఇప్పుడు దక్షిణాదికీ విస్తరించింది. ముఖ్యంగా తెలంగాణలో పశువులపై లంపీస్కిన్ వ్యాధి రోజురోజుకి విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఈ వ్యాధి కేసులు భారీగా నమోదవుతున్నట్లు పశుసంవర్ధక శాఖ వెల్లడించింది.

తెలంగాణలోనూ ఈ వ్యాధి వ్యాపిస్తోన్న తరుణంలో రాష్ట్ర పశుసంవర్దక శాఖ అప్రమత్తమైంది. రోగ లక్షణాలు గల పశువులను గుర్తించి  వైద్యులు టీకాలు వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పశువుల్లో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదా అనారోగ్యంగా ఉన్న ఆవులు, గేదెలకు తగిన చికిత్స అందిస్తూ ఐసోలేషన్ లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ విజ్ఞప్తి మేరకు ఔషధాల కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరుకు అనుమతిచ్చింది. గతంలో రూ.3 కోట్లు వెచ్చించింది.

Read more RELATED
Recommended to you

Latest news