మాకు ఉద్యోగాలు రాలేదు ఆత్మహత్య చేసుకుంటాం: హెచ్ ఆర్సీకి కానిస్టేబుల్ అభ్యర్ధులు

ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో జాప్యం అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎన్నో ఆశలు పెట్టుకుని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయినా సరే ఈ విషయంలో జాప్యం అనేది ఎక్కువగానే ఉంటుంది. తాజాగా తెలంగాణా కానిస్టేబుల్ అభ్యర్ధులు మానవ హక్కుల సంఘం వద్దకు వెళ్ళారు. 2015 పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు మానవ హక్కుల సంఘం వద్దకు వెళ్ళారు.

కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసారు. 2015 కానిస్టేబుల్ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన వ్యక్తం చేసారు. ఎన్ని సార్లు న్యాయ స్థానాల చుట్టు తిరిగినా సరే సరైన న్యాయం జరగడం లేదు అని వారు ఆవేదన వ్యక్తం చేసారు. మానవ హక్కుల కమీషన్ తమకు అనుమతి ఇస్తే కారుణ్య మరణాలకు సిద్ధపడతాం అని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసారు.