CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. వచ్చే నెలఖరులోగానే 22,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ లోపు 2 లక్షల నియామకాలు పూర్తి చేస్తామన్నారు.
ఇటీవలే మెగా డీఎస్సీకి ఆదేశించడం, ఇప్పుడు భారీగా ఉద్యోగాల భర్తీకి సీఎం నిర్ణయించడంతో ఈ ఏడాదంతా నోటిఫికేషన్లు ఉండనున్నాయి. ఇది ఇలా ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శనివారం కలిశారు.సీఎం నివాసానికి వెళ్లినషర్మిల…. తన తనయుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం, పెళ్లికి రావాలని రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి షర్మిలకు శాలువా కప్పి సత్కరించారు . అనంతరం షర్మిల తన కుమారుడి పెళ్లి పత్రికను సీఎం కి అందించారు.