కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తామని ప్రకటించారు CM రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు తెలంగాణ జనసమితికి 2 ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి ఇంటర్వ్యూలో తెలిపారు. ‘గవర్నర్ కోటాలో ప్రో. కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తాం.
ఆయన చట్టసభలోకి వెళ్తే ఎన్నో విషయాలు ప్రస్తావిస్తారు. తెలంగాణ సమాజం ఆయనను కోరుకుంటుంది. అలాగే కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసిన వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇస్తాం. ఇవన్నీ జనవరి 31 లోపు పూర్తిచేస్తాం’ అని వివరించారు.
అటు నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. వచ్చే నెలఖరులోగానే 22,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ లోపు 2 లక్షల నియామకాలు పూర్తి చేస్తామన్నారు. ఇటీవలే మెగా డీఎస్సీకి ఆదేశించడం, ఇప్పుడు భారీగా ఉద్యోగాల భర్తీకి సీఎం నిర్ణయించడంతో ఈ ఏడాదంతా నోటిఫికేషన్లు ఉండనున్నాయి.