హైదరాబాద్ మహా నగర వాహనదారులకు శుభవార్త చెప్పింది జీహెచ్‌ఎంసీ. GHMC పరిధిలో 230 పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
కేవలం GHMC పరిధిలో 230 ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు కు ప్రతిపాదనలు పంపారు అధికారులు. అలాగే.. హెచ్ఏండిఎ పరిధిలో మరో 100 పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను.. కేసీఆర్ సర్కార్ కు పంపింది GHMC.
మొదటగా… ప్రయోగాత్మకంగా హైదరాబాద్ మహా నగరంలో 14 పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది జీహెచ్‌ఎంసీ పాలక మండలి. వీటి ఏర్పాటుతో హైదరాబాద్ మహా నగర వాహనదారులకు లబ్ది చేకూరనుంది. అలాగే… ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది.