కాంగ్రెస్ లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ డిప్రెషన్ లో ఉన్నారుని ఫ్రస్ట్రేషన్ లో అబద్దాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్ధకమేనని షాకింగ్ కామెంట్స్ చేశారు.

25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విన్నింగ్ టీమ్ పనిచేస్తున్నామన్నారు. పదేళ్లలో సాగునీటి రంగాన్ని బీఆర్ఎస్ ధ్వంసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు, పలువురు సెలబ్రెటీల ఫోన్ల ట్యాపింగ్ కి గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యతని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news