తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజా గా తెలంగాణ రాష్ట్రంలో 4 ఓమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 24 కు పెరిగింది. రాష్ట్రం లో నమోదు అయిన కేసులలో నాన్ రిస్క్ దేశాల నుంచి 3 కేసులు వచ్చాయి. అలాగే కాంటాక్ట్ పర్సన్ నుంచి ఒక ఓమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఓమిక్రాన్ వేరియంట్ పై అప్రమత్తం అయింది.
అయితే తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల తో పాటు ఓమిక్రాన్ వేరియంటు కేసులు కూడా పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వేరియంట్ ను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాలను రచిస్తుంది. ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పని సరిగా ధరించాలని సూచించింది. దీంతో పాటు శానిటైజర్ ను కూడా ఉపయోగించాలని సూచించింది. భౌతిక దూరం పాటించాలని తెలిపింది. అందరూ రెండు డోసుల కరోనా టీకాలు తీసుకోవాలని తెలిపింది.