బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కేసు నమోదు

-

జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఎన్నికల నిబంధన ఉలంఘించారని తాజాగా జనగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల రోజు ఆయన మెడలో గులాబీ కలర్ కండువా కప్పుకొని పోలింగ్ బూత్ లోపలికి వెళ్లారు. అయితే, దీనిపై జనగామ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. అదే రోజు అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్ పాటు పోలీసులకు కాంగ్రెస్ లీడర్ పోలింగ్ ఏజెంట్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

కండువాతో పోలింగ్ బూత్ కి వెళ్లవద్దని ఎంత చెప్పినా వినలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బలవంతంగా పోలింగ్ బూత్ లోకి చొచ్చుకు వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని సదరు వ్యక్తి సా ఆధారాలను జత చేస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. 188 ఐపీసీ, 130 ఆర్పీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం ఆదివారం బయటకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news