నేషనల్ మీడియాలో వచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వేలు కూటమి అభ్యర్థులకు హైప్ చేసి గెలుపును చూపించాయని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్ ఛానెల్స్ లో వచ్చిన విధంగా ఎంపీ అభ్యర్థులకు ఒక రకంగా.. ఎంఎల్ఏ అభ్యర్దులకు వచ్చే సరికి పూర్తి వ్యతిరేకంగా ఫలితాలు ఎలా వస్తాయి అని ప్రశ్నించారు. ఏపీలో పోలింగ్ రోజు రాత్రి 10 గంటల వరకు మహిళలు క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేశారని గుర్తు చేశారు.
మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 120కి పైగా అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్దులు గెలుస్తారని తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ తో పాటు అన్నీ అసెంబ్లీ స్థానాలు స్వీప్ చేస్తామన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గతంలో వచ్చిన సీట్ల 8 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని.. వైసీపీ కార్యకర్తలు ఛానెల్స్ లో వచ్చిన ఎగ్జీట్ పోల్స్ చూసి అధైర్య పడాల్సిన పనిలేదని తెలిపారు. నేను కూడా కూటమి అభ్యర్థుల వైపు బెట్టింగులు వేశానని ప్రచారం చేసారు.రేపటితో వారి ప్రచారాలకు తెర పడుతుందని తెలిపారు. ఒంగోలు అసెంబ్లీ అభ్యర్ధి దామచర్ల జనార్దన్ రెచ్చగొట్టేలా మాట్లాడినా అధికారులు స్పందించడం లేదు. నాతో పాటు మా కోడలిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలని మాట్లాడుతున్నారు.టీడీపీ నేతల రెచ్చగొట్టే మాటలపై పోలీసులు స్పందించాలని కోరారు.