టెన్త్ పేపర్ లీక్ ఘటనలో ఉపాధ్యాయుడిపై కేసు నమోదు

-

వికారాబాద్ జిల్లా తాండూరులో పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పేపర్ లీక్ చేసిన టీచర్ పేరు బందప్ప. అతను 2022 బ్యాచ్ కి సంబంధించిన ఉపాధ్యాయుడు. 2010 సంవత్సరం నుండి సాయిపూరు లోని ప్రభుత్వా నెంబర్ 1 హై స్కూల్ లో విధులు నిర్వహిస్తున్నారు. బయోసైన్స్ టీచర్ గా కొనసాగుతున్నారు బందప్ప. 2017 లో ఇతనిపై ఇదే పాఠశాలలో ఫోక్సో కేసు కూడా నమోదయింది.

అయితే ఈ పదవ తరగతి ప్రశ్నాపత్రం ఎక్కడ లీక్ కాలేదని.. ఎగ్జామ్ మొదలు అయిన తరువాత పేపర్ బయటకు వచ్చిందని తెలిపారు పోలీసులు. స్కూల్ లో ఉన్న సైన్స్ టీచర్ బంధప్ప ఈ ప్రశ్న పత్రాన్ని వాట్సప్ ద్వారా బయటికి పంపించారని.. 9:37 గంటలకు పేపర్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టాడు బందప్ప. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news