TSPSC గ్రూప్ 1 పేపర్ లీక్ అయిన ఘటన ఇంకా మరువకముందే, విచారణ ఇనక జరుగుతుండగానే మరో పేపర్ లీక్ అవ్వడం తెలంగాణాలో సంచలనంగా మారింది. ఈ రోజు నుండి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ మొదలైన సంగతి తెలిసిందే. పరీక్ష ప్రారంభం అయిన పది నిముషాల్లోనే వికారాబాద్ జిల్లా తాండూర్ లో వాట్సాప్ లో పేపర్ లీక్ అయ్యింది. దీనితో విద్యార్థులు మరియు తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ విషయంపై మళ్ళీ చర్చలు స్టార్ట్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది అంటూ పలువురు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ ఇలా వరుసగా పేపర్ లు లీక్ అవ్వడం చాలా దారుణమని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి రాజీనామా చెయ్యాలని ఈయన డిమాండ్ చేస్తున్నారు. ఈ పేపర్ ను లీక్ చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని మాట్లాడారు.