దేశ చరిత్రలో ఓ అరుదైన విప్లవం.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!

-

తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు అనే దుస్థితి నుంచి పోదాం పద సర్కారు దవాఖానాకే అనే ధీమాను ఇచ్చామన్నారు. జననం నుంచి మరణం దాకా, ప్రతి దశలో మన సర్కారున్నది అనే గొప్ప భరోసా తెచ్చినం అని తెలిపారు. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, డయాలసిస్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు, బస్తీ దవాఖానలు, మాతా శిశు ఆసుపత్రులు నగరం నలుమూలలా నిర్మాణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వరంగల్ నడిబొడ్డున దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖానా నిర్మించామన్నారు.

జనాభా దామాషాలో మరే రాష్ట్రంలో లేనన్ని మెడికల్ సీట్లు అందిచామని స్పష్టం చేశారు. ఒకటా రెండా కేసీఆర్ పాలనలో వైద్య ఆరోగ్య రంగం దేశ చరిత్రలోనే ఒక అరుదైన విప్లవం అని కొనియాడారు. ఈ ట్వీట్కు 2014 తర్వాత ప్రభుత్వ దవాఖానాల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలు, నిర్మించిన మాతా శిశు దవాఖానాలు, మెడికల్ కాలేజీలు, 100 పడకల దవాఖానాల ఫొటోలు జత చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news