తిరుమలలో ఒకేరోజు వరుస ప్రమాదాలు..!

-

తిరుమలలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించిన విషయం విధితమే.  ఇవాళ తిరుమలలో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా తిరుమలలోని లడ్డు కౌంటర్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. కౌంటర్ నెంబర్ 47లో లడ్డులను ఇస్తున్నారు. కంప్యూటర్ సీపీయూలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. లడ్డుల కోసం వచ్చిన భక్తులు ఉలిక్కిపడ్డారు.

తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.  తిరుమల ఘాట్ రోడ్డులో రక్షణ గోడను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఆర్టీసీ బస్సు భక్తులను తీసుకుని కొండపైకి వెళ్తుండగా ప్రమాదం  చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 10 మంది భక్తులకు గాయాలు అయ్యాయి. అనంతరం ఆర్టీసీ బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో.. వెనుక వచ్చే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. తరువాత ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఒకే రోజు తిరుమలలో రెండు ప్రమాదాలు చోటు చేసుకోవడం ఏంటి..? అని భక్తులు ఆశ్యర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news