తెలంగాణలో మందుబాబులకు షాక్ అనే చెప్పాలి. ఇటీవలే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మే 12, 13 తేదీల్లో వైన్స్ షాపులు, బార్లు బంద్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కి సర్వం సిద్ధమైంది. ఈనెల 27న వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎక్సెజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల పోలింగ్ జరిగే మూడు జిల్లాల్లో వైన్స్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో రేపు మే 25 సాయంత్రం 4.00 గంటల నుంచి 27న సాయంత్రం 4.00 గంటల వరకు వైన్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి. మరోవైపు ఈ ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా.. ఆ మేరకు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే.. ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ ఎన్నికలో ఎవ్వరూ విజయం సాధిస్తారో వేచి చూడాలి మరీ.