మెదక్‌ లో విషాదం..తండ్రిని చంపేసి సహజమరణంగా చిత్రీకరించిన కొడుకు, కూతురు !

-

మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రిని చంపేసి సహజమరణంగా కొడుకు, కూతురు, అల్లుడు చిత్రీకరించారు. మృతుడి భార్య లచ్చవ్వ ఫిర్యాదుతో ఏడాదిన్నర తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2022 జూలై 16న అర్థరాత్రి తండ్రి కిష్టయ్యని ఇంట్లో తలగడ ముఖంపై పెట్టి ఊపిరి ఆడకుండా చంపేశారు కొడుకు స్వామి, కూతురు రేణుక, అల్లుడు అశోక్.

A son and daughter who killed their father and died of natural causes

అయితే… గ్రామస్తులు కిష్టయ్య మృతిపై అనుమానం వ్యక్తం చేయగా సహజ మరణంగా చిత్రీకరించారు కుటుంబ సభ్యులు. కిష్టయ్య ని హత్య చేసిన కొన్ని రోజులకు అల్లుడు చనిపోగా…తన పేరుపై భూమిని పట్టా చేసుకున్నాడు కొడుకు. అయితే… కొడుకు, కూతురు వ్యవహారశైలిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి లచ్చవ్వ. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని కిష్టయ్య శవాన్ని పాతిపెట్టిన చోట గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్య బృందంతో రీ పోస్టుమార్టం నిర్వహించారు పోలీసులు. ఇక రిపోర్టు ఆధారంగా కుటుంబ సభ్యులను విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో నిందులను అరెస్ట్‌ చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news