రుణమాఫీ పై శ్వేతపత్రం విడుదల చేయాలి.. కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్

-

రుణమాఫీ పై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ పై త్వరలోనే కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎంత మందికి కావాల్సి ఉంది..? వివరాలు బయట పెట్టాలన్నారు. నిజంగా రుణ మాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్డు మీదకు వస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు.

రేవంత్ రెడ్డి ఏబీవీపీ నుంచి వచ్చారు కాబట్టే బీజేపీలోకి పోతారని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చారు. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తున్నారా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రెండూ అవినీతి, కుటుంబ పార్టీలు అని విమర్శించారు. ఈ రెండు పార్టీలు తప్పక కలుస్తాయన్నారు. లేకుంటే ఈ పాటికి కేసీఆర్ ను జైలులో వేయాలి కదా అని ప్రశ్నించారు. ఇరు పార్టీల మధ్య ఇచ్చుపుచ్చుకునే విషయంలో మాట ముచ్చటంతా పూర్తి అయిందని.. చేరికలు మాత్రమే మిగిలాయని ఆరోపించారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news