తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో క్షమాపణల పర్వం కొనసాగుతోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వరుసగా కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అద్దంకి దయాకర్ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు వీడియోను కూడా అద్దంకి దయాకర్ విడుదల చేశారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మరోసారి క్షమాపణ చెప్తున్నానని పేర్కొన్నారు అద్దంకి దయాకర్. భవిష్యత్‌లో మరోసారి అలా జరగనివ్వను, పార్టీకి నష్టం జరగకూడదని మరోసారి క్షమాపణ చెబుతున్నా అని వెల్లడించారు. , క్రమశిక్షణా కమిటీ నోటీసులపై రాతపూర్వకంగా క్షమాపణ కోరా, పార్టీలో కలిసి పనిచేయడానికి కోమటిరెడ్డి ముందుకు రావాలని కోరారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పార్టీ చూసుకుంటుందన్నారు అద్దంకి దయాకర్.