అల్బెండజోల్ టాబ్లెట్ అందచేసిన తెలంగాణ మంత్రులు

-

అల్బెండజోల్ టాబ్లెట్ అందచేశారు తెలంగాణ మంత్రులు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్… రాజ్ భవన్ హై స్కూల్ లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమం లో విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్ అందచేశారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ ప్రాముఖ్యత తెలిపే బ్రోచర్ విడుదల చేశారు మంత్రులు.

Albendazole tablet provided by Telangana ministers

ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్,స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయ రెడ్డి,వైద్య ఆరోగ్యశాఖ, విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ… జీవితంలో ఆరోగ్యం ముఖ్యమైనదన్నారు. ప్రభుత్వ పాఠశాల, ఆసుపత్రి అన్ని మన కోసం ఏర్పాటు అయ్యాయని…. అందరి ఆరోగ్యం బాగుండాలని అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. యోగ డే సందర్భంగా కార్యక్రమాలు మొదలు పెట్టామని.. యోగ అందరికీ ఉపయోగపడే అంశం అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news