BJP: “తెలంగాణకు వందనం” పేరుతో బీజేపీ ర్యాలీ, సభ..షెడ్యూల్‌ ఇదే

-

తెలంగాణ కు వందనం పేరుతో బీజేపీ ర్యాలీ, సభకు ప్లాన్‌ చేసింది. మోడీ 3.0 లో కేంద్ర మంత్రి పదవి చేపట్టి మొదటి సారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకి బేగం పేటలో భారీ స్వాగత కార్యక్రమం ఉండనుంది. అంతేకాదు.. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ర్యాలీలో కేంద్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మేల్యేలు, కీలక నేతలందరూ పాల్గొంటారు.

ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయం వద్ద నిర్వహించే సభలో కేంద్ర మంత్రులకు , ఎంపిలకు సన్మానం కూడా ఉంటుంది. ఆ తరువాత భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు నేతలు. ఇక ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు బేగం పేట విమానాశ్రయం చేరుకోనున్నారు కిషన్ రెడ్డి. రసూల్ పూర, ప్యారడైజ్, రానిగంజ్, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణ గూడ, హిమాయత్ నగర్ ల మీదుగా బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ ఉంటుంది. ర్యాలీ జరిగే రూట్ లో భారీగా ఫ్లెక్సీ లు, బానర్ లు, జండాలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news