తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ వారసులు అందరూ కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వనిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గాంధీభవన్ లో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు ప్రయత్నించేవారు మాత్రమే వైఎస్ఆర్ కు నిజమైన వారసులు అని.. రాహుల్ గాంధీ ప్రధాని పదవికి అడుగు దూరంలో ఉన్నారని.. ఆయనను ప్రధానిగా చేయాలని వైఎస్ఆర్ అప్పట్లోనే చెప్పారని.. అందుకోసం ప్రతి కార్యకర్త కష్టపడాలని.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని పదవికి అడుగు దూరంలో ఉన్నాడంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఇదే రోజున తాను తెలంగాణ పీసీసీగా బాధ్యతలు చేపట్టానని.. ఈ మూడు సంవత్సరాల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు.