హైదరాబాద్ అభివృద్ధికి పది వేల కోట్ల నిధులు.. కానీ..?

-

కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. కానీ కేంద్రం నిధులు ఇవ్వడం లేదని మంత్రి పదే పదే అనడం సరికాదు అని అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణలలో పాటు … తెలంగాణలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇచ్చేందుకు వెనకడుగు ఎప్పుడు వేయదు. ఢిల్లీకి నిధుల గురించి మీరు వెళ్ళే ముందు చెప్పండి.. మేము వస్తాం అని ఆయన పేర్కొన్నారు.

మీరు ప్రభుత్వ డబ్బులతో వస్తె మేమే మా సొంత ఖర్చులతో వస్తాం. మూసి రివర్ కార్పొరేషన్ లో కేంద్రం సహకారం ఉంటుంది. హైదరాబాద్ అభివృద్ధికి పది వేల కోట్ల నిధులు కేటాయించాలని లెక్కలు చెప్తున్నారు. కానీ బల్దియా ముందు GHMC కాంట్రాక్టర్లు బిల్లులు రాక ధర్నాలు చేస్తున్నారు. హైదారాబాద్ లో నాళాలు విస్తరించాలి . భాగ్యనగరం బాగ్య రేఖగా మారాలి అని మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news