తెలంగాణలో బిజెపి అధికారమే లక్ష్యంగా కమలనాధులు కార్యాచరణకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే బిజెపి అధిష్టానం తరచూ తెలంగాణకు వస్తు.. అటు నాయకులకు దిశ నిర్దేశం చేస్తూనే.. ఇటు శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 11వ తేదీన తెలంగాణకు విచ్చేస్తున్నారు.
అయితే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జాతీయ నేతలు తెలంగాణలో పదేపదే పర్యటిస్తుండడం.. మరోవైపు ముందస్తుకు సిద్ధమంటూ ఇటు బండి సంజయ్, అటు కేటీఆర్ సవాళ్లు విసురుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అమిత్ టూర్ చర్చనీయాంశంగా మారింది పార్లమెంట్ ప్రభాస్ యోజనలో భాగంగా ఈ నెల 11వ తేదీన తెలంగాణకు రానున్న అమిత్ షా.. ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరున జేపీ నడ్డా కూడా తెలంగాణకు రానున్నారు.