అధికార వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన ఫోన్ టాపింగ్ పై ఆధారాలను సైతం బయట పెట్టారు. తన ఫోన్ టైపింగ్ చేయడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్ టాపింగ్ అవుతుందని నాలుగు నెలల క్రితమే ఓ ఐపీఎస్ అధికారికి తెలిపినట్లు వెల్లడించారు. అయితే 20 రోజుల క్రితం తన ఫోన్ టాపింగ్ ఆధారం లభించిందని.. ముఖ్యమంత్రికి, సజ్జలకు తెలియకుండానే తన ఫోన్ ట్యాప్ కాదని అన్నారు కోటంరెడ్డి.
తనని అనుమానించారని తెలిసి చాలా బాధపడ్డాను అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి ఫోన్ టాపింగ్ వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి తీరుపై చర్చిస్తున్నారు. నెల్లూరు రూరల్ ఇన్చార్జి బాధ్యతలు నుంచి కోటంరెడ్డిని తప్పించే అవకాశం ఉండట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన స్థానంలో ఎవరిని నియమించాలి అనేది చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.