తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ లో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా గవర్నర్ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఆ గ్రామాల ప్రజలు. అలాగే భద్రాచలం ముంపు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. భద్రాచలం సరిహద్దులో ఉన్న అయిదు గ్రామాలను తెలంగాణ లో విలీనం చేయాలని అయిదు గ్రామాల ప్రజలు గవర్నర్ తమిళ సై కి విజ్ఞప్తి చేశారు.
భద్రాచలంలో గవర్నర్ తమిళ సై పర్యటన సందర్బంగా గిరిజనులతో ఆరోగ్య రక్షన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా పురుషోత్తమ పట్నం, ఎటపాక , పిచుకుల పాడు, కన్నాయి గూడెం, గుండాలకు చెందిన గిరిజనులు గవర్నర్ ను కలిశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ.. తాము ఎపిలో ఇబ్బందులు పడుతున్నామని, ఎపి చాలా దూరంగా ఉన్నదని, అందువల్ల తమను తెలంగాణ ప్రాంతం అయిన భద్రాచలంలో కలుపాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు గ్రామస్తులు. అయితే వీరి సమస్యను విన్న గవర్నర్ అయిదు గ్రామాల ప్రజల పరిస్తితి విన్నానని.. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం తాను ప్రభుత్వాలతో మాట్లాడతునానని అన్నారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం తో కూడ చర్చిస్తానని చెప్పారు.