వరంగల్ కిట్స్ బృందాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్

-

డ్రైవర్ రహిత స్వయం చోదక ట్రాక్టర్ ను అభివృద్ధి చేసిన వరంగల్ కిట్స్ బృందాన్ని అభినందించారు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. వరంగల్ కి చెందిన కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ అభివృద్ధి చేసిన స్వయం చోదక ట్రాక్టర్ తనకి ఎంతగానో నచ్చిందని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. ఇలాంటి ఆవిష్కరణలతో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో వ్యవసాయం, సామాజిక ప్రభావం చూపాలని, యువ ఆవిష్కర్తలు ఇలాంటి మరిన్ని ఆలోచనలు, ఉత్పత్తులతో బయటకు రావాలని కోరారు.

సామాజిక మేలు కోసం మంచి ఆవిష్కరణలు ఆవిష్కరించండి అంటూ ట్విట్టర్ లో యువతకు సూచించారు. ఈ ట్రాక్టర్ కి డ్రైవర్ అవసరం లేదు. పొలంలోకి తీసుకెళ్లి స్టార్ట్ చేస్తే చాలు.. దానంతట అదే పొలం చుట్టూ తిరుగుతూ దున్నేస్తోంది. కిట్స్ అభివృద్ధి చేసిన ఈ ట్రాక్టర్ రైతులను మరింత ఆకట్టుకుంటుంది. డ్రైవర్ ఖర్చులు కూడా మిగులుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news