ఏసీబీ వలలో మరో వ్యవసాయ అధికారి..!

-

ఈ మధ్య కాలంలో ప్రభుత్వ అధికారులు ప్రతీ చోట లంచాలు తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కుతున్నారు. కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఈ సంఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో చోటు చేసుకుంది.  షాపు రెన్యూవల్ కోసం ఓ వ్యక్తి నుంచి 30 వేలు లంచం తీసుకుంటూ వ్యవసాయ అధికారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ ఘటన నర్సాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే నిజాంబాద్ జిల్లా బోధన్ మండలానికి చెందిన వంగ నరేష్ కు ట్రేడ్ లైసెన్సు జారీ తో పాటు శివశక్తి అగ్రో ఏజెన్సీస్ నర్సాపూర్ పేరుతో ఫార్వర్డ్ చేయడానికి నర్సాపూర్ మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ కు దరఖాస్తు చేసుకున్నాడు.

అయితే ఇందుకోసం మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ 30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో వంగ నరేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దాంతో ఏసీబీ అధికారులు వల పన్ని రెక్కీ నిర్వహించి గురువారం నర్సాపూర్ పట్టణంలో అనిల్ కుమార్ సదరు నరేష్ నుంచి లంచం తీసుకుంటున్న క్రమంలో పట్టుకున్నారు. ప్రస్తుతం అనిల్ కుమార్ హైదరాబాద్ యాంటీ కరప్షన్ బ్యూరో అధికారుల అదుపులో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news