హైదరాబాద్‌లో పేలుళ్లకు ఉగ్రకుట్ర కేసులో మరొకరు అరెస్టు అయ్యారు. పాతబస్తీకి చెందిన ఎండీ అబ్దుల్ కలీమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది దసరా సందర్భంగా నిందితులు పేలుళ్లకు కుట్ర పన్నారు. అక్టోబర్‌లోనే సీసీఎస్ పోలీసులు జాహెద్, సమి, మాజ్‌ను అరెస్ట్ చేశారు. వీరందరికి పాకిస్థాన్ నుంచి హవాలా మార్గంలో డబ్బు చేరినట్లు గుర్తించారు.
హవాలా డబ్బును అబ్దుల్ కలీమ్ జాహెద్‌కు అందించాడు. ఇన్నాళ్లు పరారీలో ఉన్న కలీమ్‌ను తాజాగా సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. లష్కర్ ఏ తొయిబా, ఐఎస్ఐ ప్రోద్బలంతో గతేడాది వీరంతా హైదరాబాద్ మహానగరంలో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. విశ్వనీయ వర్గాల సమాచారంతో ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ టాస్క్ఫోర్స్, సీసీఎస్ పోలీసులు ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా జాహెద్ ఉన్నాడు. తాజాగా అరెస్టు చేసిన కలీమ్ నుంచి మరింత విలువైన సమాచారాన్ని రాబడతామని పోలీసులు తెలిపారు.