తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి గురువారం రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న డీపోలలో బస్సు దినోత్సవం నిర్వహించాలని అధికారులను ఆదేశించాడు. ఈ బస్సు దినోత్సవం రోజు ఆర్టీసీ ఉద్యోగులు.. అధికారులు అందరూ ఆర్టీసీ బస్సుల ల్లోనే ప్రయాణించాలని సూచించాడు. ఇలా ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడం వల్ల ప్రయాణీకుల సమస్యల ను నేరుగా తెలుసు కునే అవకాశం ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు.
దీంతో ఆ సమస్యల ను పరిష్కరించి.. మెరుగైన సేవలను అందించ వచ్చని అన్నారు. కాగ తెలంగాణ ఆర్టీసీ ఎండీ గా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నష్టాల్లో పెరుకు పోయిన ఆర్టీసీ ని లాభాల బాట పట్టించ డానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగం గానే పలు కొత్త పథకాలను తీసుకు వస్తున్నాడు. అయితే ఈ బస్సు దినోత్సవం కార్యక్రమం ఎంత వరకు సక్సస్ అవుతుందో చూడాలి.