తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. రూ. 100 కోట్ల‌తో మ‌రో భారీ ఐటీ పార్క్

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో కీలక నిర్ణ‌యం తీసుకుంది. రూ. 100 కోట్లు వెచ్చించి భారీ ఐటీ పార్క్ ను నిర్మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ భారీ ఐటీ పార్క్ ద్వారా రాష్ట్రంలో కొత్త‌గా 50 వేల ఉద్యోగాలు సృష్టించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు అంచ‌న వేస్తున్నాయి. తెలంగాణ గేట్ వే అనే పేరుతో ఈ ఐటీ పార్క్ ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ ఐటీ పార్క్ ను మేడ్చ‌ల్ జిల్లాలోని కండ్ల‌కోయలో నిర్మించ‌నున్నారు.

దాదాపు రూ. 100 కోట్ల‌తో 10 ఏక‌రాల్లో ఈ భారీ నిర్మాణాన్ని చేప‌ట్ట‌నున్నారు. రాష్ట్రంలో అత్యంత ఎత్తైన ఐటీ పార్క్ గా దీన్ని నిర్మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రణాళిక‌లు ర‌చిస్తోంది. ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ భారీ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ మంత్రి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. కాగ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాడ్డ నాటి నుంచి ఐటీ రంగం వృద్ధి మొగ్గు చూపుతుంది. ఐటీ మంత్రి కేటీఆర్ భారీగా ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకురావ‌డంతో పాటు ఐటీ పార్క్ ల‌ను కూడా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే టీ- హ‌బ్ అనే పేరు తో ఒక బిసినేస్ ఇంక్యుబేట‌ర్ ను నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news