మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్.. ప్రహరీ గోడ కూల్చివేత

-

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. షామీర్ పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్‌ లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. జెేసీబీలతో చెరువులో నిర్మించిన ప్రహరీ గోడలను కూల్చివేయిస్తున్నారు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు.

నగర శివార్లలోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలో సర్వేనంబరు 82, 83లలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య నెలకొన్న భూ వివాదం తెలిసిందే. అయితే రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదని మరో 15 మంది చెబుతున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం సర్వే నెం.82లోని స్థలంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడుకు.. మరో 15మంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news