ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కేసులో మరో ట్విస్ట్..!

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసును విచారిస్తోన్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి నాగ్ పాల్ అనూహ్యంగా బదిలీ అయ్యారు. నాగ్ పాల్ స్థానంలో జడ్జి కావేరి బవేజా నియామకమయ్యారు. దీంతో ఇక నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును జడ్జి కావేరి విచారించనున్నారు. నాగ్ పాల్ తో పాటు ఢిల్లీ హైకోర్టు జ్యూడిషియల్ సర్వీసెస్లోని మరో 26 మంది జడ్జీలు సైతం ఇవాళ బదిలీ అయ్యారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

 

హైదరాబాద్ లో కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరపర్చించింది. కవిత రిమాండ్పై వాదనలు విన్న జడ్జి నాగ్ పాల్.. ఆమెను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించారు. కవిత అరెస్ట్ కావడం.. ఆమెను వారంరోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చిన మూడు రోజుల్లోనే జడ్జి నాగ్ పాల్ బదిలీ కావడం హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక దశలో ఉండగా.. ఇప్పటి వరకు ఈ కేసులో కీలక ఆదేశాలిచ్చిన జడ్జి నాగ్ పాల్ అనూహ్యంగా ట్రాన్స్ఫర్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news