ఆంధ్రా నుంచి తెలంగాణ బాటపట్టిన ఓటర్లు

-

తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ ముగిసింది. ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లిన వారంతా నెమ్మదిగా నగరాలకు చేరుకుంటున్నారు. కార్లు, బస్సులు.. ఏ వాహనం దొరికితే అది పట్టుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు. హైదరాబాద్‌ వైపు వచ్చే రహదారుల్లో సోమవారం సాయంత్రం 5 గంటల దాటాక ఒక్కసారిగా రద్దీ పెరిగింది.

ఎన్టీఆర్‌ జిల్లా చిల్లకల్లు టోల్‌గేట్‌ వద్ద సాధారణంగా 24 గంటల వ్యవధిలో 20 వేలకు పైగా వాహనాలు హైదరాబాద్‌ వైపు వెళ్తుంటాయి. సోమవారం మాత్రం సాయంత్రం 6.30 గంటలకు వీటి సంఖ్య 35 వేలకు పైగా చేరింది. రద్దీ అంతకంతకు పెరుగుతోంది. ఇక ఈరోజు ఈ రద్దీ మరింత పెరిగింది

ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుమారు 6 లక్షల మంది తెలంగాణ నుంచి వచ్చినట్లు అంచనా.  సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకునేందుకు వివిధ దేశాల నుంచీ ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున తరలివచ్చారు. అధికశాతం ప్రవాసాంధ్రులు సాయంత్రానికే తిరుగు ప్రయాణమయ్యారు. ‘

Read more RELATED
Recommended to you

Latest news