మోడీకి ఓటు వెయ్యకుంటే నరకానికి పోతారు – ఎంపీ ధర్మపురి అరవింద్

-

మోడీ ఇచ్చే పథకాలు తీసుకుంటూ మోడీకి ఓటు వెయ్యకుంటే నరకానికి పోతారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి.. అబద్ధపు హామీ లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని…కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తున్నాడని ఫైర్‌ అయ్యారు. నిధులన్నీ నల్గొండ… ఖమ్మం జిల్లాలకే మళ్లీస్తున్నారని ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్‌ వైఖరి నిరసిస్తూ ఎంపీ ఎన్నికల తర్వాత కొడంగల్ లో దీక్ష చేస్తామని ప్రకటించారు బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి.

aravind comments viral

ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కి డబుల్ డిజిట్ వస్తుందని… కాంగ్రెస్… బీఆర్ఎస్ లకు అభ్యర్థుకు కరువయ్యారని ఎద్దేవా చేశారు. పసుపు పంటపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని… గతం కంటే లక్షన్నర ఎకరాల సాగు పెరిగిందన్నారు. గత పాలకుల విధానాల వల్లే పసుపు రైతులకు కష్టాలు అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ లు తెరిపించడం బీజేపీ తోనే సాధ్యమని ప్రకటించారు బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి.

Read more RELATED
Recommended to you

Latest news