కోదండరెడ్డి నీకు సిగ్గుందా.. తాతా మధు సంచలన వ్యాఖ్యలు..!

-

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు గ్రామంలో  బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే.. బీఆర్ఎస్ నేతల ప్రోద్బలంతోనే ప్రభాకర్ సూసైడ్ చేసుకున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి పేర్కొన్నారు.  చనిపోయిన వ్యక్తి ప్రభాకర్ నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను అని మరణ వాంగ్మూలం ఇస్తే.. అతను బీఆర్ఎస్ కార్యకర్త అనడానికి సిగ్గు లేదా కోదండ రెడ్డి అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్.

తాజాగా తాతా మధు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. చనిపోయిన ప్రభాకర్  వాళ్ళ నాన్న గారు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే A1గా ఉన్న కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త కూరపాటి కిషోర్ ని పోలీసులు A8 గా మార్చారు. ఎందుకు మార్చారు అనేది పోలీసులు చెప్పాలి లేదా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి భట్టి విక్రమార్క చెప్పాలి. ప్రభాకర్ చావుకు కారణమైనటువంటి వ్యక్తిని మీరు ఎందుకు A8 మార్చారు వెనకాల ఏ శక్తులు ఉన్నాయని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news