అసదుద్దీన్ ఒవైసీ వెంటనే క్షమాపణ చెప్పాలి.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. అసదుద్దీన్ ఇలా చేస్తున్నా ఎన్నికల కమిషన్ ఏమి చేస్తుందని ప్రశ్నించారు. నిన్న అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ప్రచారం చేసుకుంటూ ఓ బీఫ్ షాపులోకి వెళ్లి కోయండి. కోస్తూనే ఉండండి.. తినండి అని మాట్లాడుతున్నారని, అదేవిధంగా నేను కూడా ఒక పందిని కోసే షాపులోకి వెళ్లి అదే కామెంట్ చేస్తే.. ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తున్న రాజాసింగ్ ఏడ్చే వాడివని ఆగ్రహం వ్యక్తం చేశారు.

యావత్ భారత్ లో 100 కోట్ల మంది హిందువుల గోమాతను తమ తల్లిలాగా చూసి దేవుడిగలా పూజిస్తారని పేర్కొన్నారు. నువ్వు ఇలాంటి కామెంట్స్ చేసి ఓటు బ్యాంకు రాజకీయం ఆడుతున్నావని.. చీప్ రాజకీయాలు చేస్తున్నావని మండిపడ్డారు. అసదుద్దీన్ ఇలాంటి కామెంట్స్ చేస్తుంటే.. ఎలక్షన్ కమిషన్ ఏమి చేస్తుందని, పోలీసులు సుమోటో కేసు బుక్ చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. పోలీసులు అలా చేయరని, ఎందుకు అంటే.. సీఎం రేవంత్ రెడ్డి అసదుద్దీన్ సపోర్టుగా ఉంటే.. పోలీసులు కూడా ఉండాలి కదా.. ప్రతీసారి ఇలాగే అవుతుందన్నారు. అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కేసు బుక్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నానని.. ఆయన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news