బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు తెరిచిన అధికారులు

-

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను నీటిపారుదల శాఖ అధికారులు తెరిచారు. ఈ గేట్లను అక్టోబర్ 28వ తేదీ వరకు తెరిచి ఉంచనున్నారు. శ్రీరామసాగర్ ప్రాజెక్టు ఎగువన గోదావరి నదిపై నిర్మించిన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామసాగర్ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో పాటు మహారాష్ట్ర, సీడబ్ల్యూసీ, ఆంధ్రప్రదేశ్ సాగు నీటి పారుదల శాఖ ఇంజినీర్లు పాల్గొన్నారు.

శ్రీరామ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా 1064. 90 వరకు నీటిమట్టం ఉంది. 20 టీఎంసీల నీరుంది. ఎగువ నుంచి 55 క్యూసెక్కుల వరద చేరుతోంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 50, మిషన్ భగీరథ ద్వారా 152 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల జరుగుతోంది. బాబ్లీ గేట్లు ఎత్తడంతో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి జలకళను సంతరించుకుంది. ఈ వానాకాలంలో సరైన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న నిజామాబాద్ రైతులకు ఈ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కాస్త వరకు నీటి సమస్య తీరినట్టే కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news