సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తెలంగాణలో “నారా రేవంత్ రెడ్డి నాయుడు” ప్రభుత్వం నడుస్తుందన్నారు. చిల్లర ముఖ్యమంత్రి, చిల్లర ప్రభుత్వం.. ఉద్యమాన్ని గౌరవించని వాడు ఈ చిల్లర ముఖ్యమంత్రి అని.. ముఖ్యమంత్రి అప్పట్లో కాలేజీల దగ్గర అమ్మాయిలకు లైటింగ్ కొట్టుకునే వాడని చురకలు అంటించారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసింది ఇరు రాష్ట్రాల అభివృద్ధి కోసం కానేకాదు, పాత కేసుల మాఫీ కోసం ముగ్గురు ముద్దాయిల ముద్దుల కలయిక అది అని ఫైర్ అయ్యారు.
ఇక్కడున్న మీడియా “మా నారా రేవంత్ నాయుడు ప్రభుత్వం అనుకొని నిరుద్యోగుల ఉద్యమం న్యూస్ వెయ్యడం లేదు” ఆంధ్రాలో ఒక నాయకుడు ఎవరినో ఉంచుకున్నాడు, అది ఇంటర్నేషనల్ సమస్య అంటూ గంటలు గంటలు నడిపిస్తున్న యాంకర్లకు సిగ్గు లేదని ఆగ్రహించారు. నిరుద్యోగుల ఉద్యమం నీరు కారిపోలేదు, కానీ ఒక 20 ఏళ్లు ప్రశ్నించే గొంతుకలు తయారు అయ్యాయి…. 29 లక్షల నిరుద్యోగులు నీ పని పడతారురా అయ్యా.. విద్యార్థుల పట్ల మాట్లాడే మాటలు కావు అవి ఒక లంపెను గాడు మాట్లాడే మాటలు అవి అంటూ ఆగ్రహించారు. దేశ అభివృద్ధి, అవినీతి గురించి చెప్పే వాళ్లు ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ముద్దాయిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసే కర్మ కాంగ్రెస్ హై కమాండ్ కేం పట్టింది అనిపించింది.