రైతులకు షాక్..ఆగస్టు 15 లోపు రుణమాఫీ కావడం కష్టామే అంటున్నారు నిపుణులు. లక్ష లోపు రుణమాఫీ అవ్వలేదు అని రైతుల ఫిర్యాదులు… ఆగస్టు 15 తరువాత సమస్యలు పరిష్కారిస్తాం అంటున్నారు అధికారులు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఆగస్ట్ 15 లోపు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసి తీరుతాం అని దేవుళ్ళ పై ప్రమాణం చేసి మరి చెప్పారు రేవంత్ రెడ్డి… దానికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇస్తూ ఆగస్టు 15 లోపు ప్రతి రైతుకు రుణమాఫీ చేసి, ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే తన పదవికి రాజీనామా చేసి తీరుతా అని సవాల్ విసిరారు.
అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రుణమాఫీ మొదటగా లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ చేయాలని నిర్ణయించింది… అయితే లక్ష లోపు రుణాలు తీసుకున్న లక్షలాది మంది రైతుల పేర్లు జాబితాల్లో లేకపోవడం మరియు కొంతమంది రైతులకు 70 వేలు, 80 వేలు ఉంటే 20 వేలు, 30 వేలు మాఫీ అవ్వడం జరిగింది.. దీంతో ఏం జరుగుతుందో తెలియక రెైతులు ఆందోళన చెందుతున్నారు. లక్ష రుణమాఫీ కాలేని రైతులు, సగం సగం మాఫీ అయిన రైతులు జిల్లాల్లోని వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు.. వారి సమస్యలు ఆగష్టు 15 తరువాత పరిష్కరిస్తాం అంటున్నారు.