కేసీఆర్ ను తెలంగాణ నుంచి తరిమేసే రోజులు వస్తాయని… పాలమూరులో వలసలు లేవని చెబుతున్నారని… నేను నిరూపిస్తా అని, నిరూపిస్తే కేసీఆర్ తెలంగాణ విడిచివెళ్లిపోతారా అంటూ సవాల్ విసిరారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పాలమూరును సస్యశ్యామలం చేసే అవకాశం ఉన్నా… కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్డీఎస్ వద్ద కుర్చీ వేసుకుంటా అని చెప్పిన కేసీఆర్, ఎందుకు ఆధునీకీకరించలేదని ప్రశ్నించారు. తెలంగాణకు రాహుల్ గాంధీ ఏం పీకడానికి వస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. 1400 మంది చనిపోయారని… పేదలు తెలంగాణ ఉద్యమంలో చనిపోయారని.. కారణం కాంగ్రెస్ పార్టీనే అని బండి సంజయ్ విమర్శించారు. రాహుల్ గాంధీ ఓయూకు ఎందుకు వెళ్లుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదని అన్నారు. కాంగ్రెస్, టీాఆర్ఎస్ ఒకటే అని.. ఇద్దరు కలిసి పోటీ చేస్తారని బండి సంజయ్ ఆరోపించారు. ఇక్కడి మంత్రి మూర్ఖుడని… పేదోల ఇళ్లు, సాయంత్రం మంత్రి కబ్జాలకు పోతున్నాయని… పోలీసులను, రిపోర్టర్లను, బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను విమర్శించారు. మేం పేద ప్రజల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం రౌడీయిజం చేస్తామని బండి సంజయ్ అన్నారు. కేవలం ఒకే ఏడాది టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని అన్నారు.
కేసీఆర్ ను తెలంగాణ నుంచి ప్రజలు తరిమేస్తారు…. ఏం పీకడానికి రాహుల్ గాంధీ వస్తున్నారు: బండి సంజయ్
-