జీవితంలో సదా మామూలుగానే జరుగుతున్నవే అయినా.. అవి అలానే ఎందుకు ఉంటాయో తెలిస్తే భలే ఇంట్రస్టింగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంది.. కానీ ఒకప్పుడు పరిస్థితులు వేరు.. ఆరోజుల్లో జరిగిన కొన్ని కథలు మనకు ఇప్పుడు ఆసక్తికరంగా ఉంటాయి. చాలామందికి షూస్ లో కుడి ఎడమ సెలెక్ట్ చేసుకోవడం కొంచె కన్ఫూస్ గా ఉంటుంది..రెండ ఒకేలా ఉంటే బాగుండు అనుకుంటారు.. అవును ఒకప్పుడు అలానే ఉండేవి. ఓ ప్రధాని మీద కోపం వచ్చి ఆయన్ని చంపేసి.. ఆ దేశ ప్రజలంతా తింటే.. వామ్మో ఇదేదో తేడాగా ఉందే.. ఇలాంటి ఇంట్రస్టింక్ క్రేజీ ఫ్యాక్ట్స్ మీకోసం.. మీరు కచ్చితంగా ఇందులో ఏదో ఒక దానికి కనెక్ట్ అవుతారు చూడండి..!
ఇన్‌స్టాగ్రామ్‌లో 5 శాతం ఫొటోలు సెల్ఫీలే ఉంటాయి.
మనుషుల తొడ ఎముక, కాంక్రీట్ కంటే బలంగా ఉంటుంది.
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవారు ఇతరులను బాగా ఆకర్షిస్తారు.
మొట్టమొదటి కెమెరాలో మీరు ఫోటో దిగాలంటే..8 గంటలు కదలకుండా కూర్చోవాలి.
1933లో ప్రపంచంలోనే అతి చిన్న వయసులో అంటే.. ఐదేళ్లకే ఓ బాలిక ప్రసవించింది.
2007లో గూఢచర్యం కేసులో ఇరాన్ మొత్తం 14 ఉడుతల్ని అరెస్టు చేసి, జైల్లో పెట్టింది.
1672లో ఆగ్రహావేశాలతో ఊగిపోయిన డచ్ ప్రజలు.. తమ ప్రధానమంత్రిని చంపి, తినేశారట.
1850కి ముందు కుడి, ఎడమ అని వేర్వేరు షూస్ ఉండేవి కావు. రెండూ ఒకేలా ఉండేవట.
ఎక్కువ సెల్ఫీలను పోస్ట్ చేసేవారు మానసిక రోగులు అయ్యే అవకాశం ఉందని ఓ పరిశోధన తేల్చింది.
గురుత్వాకర్షణ శక్తి (zero gravity) లేని చోట కొవ్వొత్తి గుండ్రంగా వెలుగుతుంది. దాని మంట బ్లూ కలర్‌లో ఉంటుంది.
నిద్ర లేచిన 5 నిమిషాల్లో 50 శాతం కలను మర్చిపోతారు. 10 నిమిషాల్లో 90 శాతం కలను మర్చిపోతారు. మీకు ఇలా జరిగే ఉంటుందే..
భూమిపై 50 లక్షల సంవత్సరాల తర్వాత మగవారు ఉండరని అంచనా. కారణం Y క్రోమోజోమ్ బలహీనపడుతూ ఉండటమేనట.
యోగర్ట్ (Yoghurt) అంటే పెరుగు. ఈ పదం యోగురుర్ అనే టర్కీ పదం నుంచి వచ్చింది. యోగురుర్ అంటే సుదీర్ఘ జీవితం అని మీనింగ్.. అంటే.. పెరుగు తింటే.. ఎక్కువకాలం బతుకుతారని వారి ఉద్దేశం.
ఎవరి గురించీ నెగెటివ్‌గా మాట్లాడకుండా ఓ వారం, నెల లేదా ఓ సంవత్సరం పాటూ ఉండి చూడండి. మీ జీవితంలో ఏం జరుగుతుందో చూడండి.
చాలా మంది మగవారికి కుడివైపు వృషణం (right testicle) పెద్దగా ఉంటుంది. అది ఎడమ వృషణంపై కూర్చుంటుంది.
-Triveni Buskarowthu