టీడీపీ, బీజేపీ పొత్తు వ్యవహారంపై బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

-

టీడీపీ, బీజేపీ పొత్తు ఖాయమైందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. అలాంటి ఊహాజనిత కథనాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కలిస్తే తప్పేంటి..? అని ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకుల హోదాలో మమతా బెనర్జీ, స్టాలిన్‌, నీతీశ్‌ కుమార్‌లు కూడా మోదీ, అమిత్‌ షాలను కలిశారని గుర్తు చేశారు.

‘‘తెలంగాణలో బీజేపీ గ్రాఫ్‌ పెరుగుతోంది. ఇప్పుడు దానిని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్‌ సహా మరికొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిసే పోటీ చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నెలాఖరు వరకు జరిగే ‘మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌’ కార్యక్రమాలను విజయవంతం చేయాలి’’ అని తమ పార్టీ నేతలకు బండి సంజయ్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news