వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న బండి సంజయ్ పాదయాత్ర

-

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. యాదాద్రిలో ప్రారంభమైన ఈ యాత్ర జనగామ జిల్లాలోని అప్పిరెడ్డిపల్లె వద్ద ఈ మైలురాయిని చేరుకుంది. ఈ మైలురాయికి చిహ్నంగా బండి సంజయ్ పాలకుర్తి మండలం అప్పిరెడ్డిపల్లె వద్ద పైలాన్ ఆవిష్కరించారు. బెలూన్లు, బాణాసంచా, డప్పు వాద్యాలతో భాజపా శ్రేణులు సందడి చేశారు. చీటూర్, కిష్టగూడెం మీదుగా కుందారం వరకు బండి సంజయ్ పాదయాత్ర సాగింది.

ఈ యాత్ర మొదటి నుంచి బండి సంజయ్ కేసీఆర్ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ వచ్చారు. తెరాస వైఫల్యాలు, కేసీఆర్ పాలనలో జరిగిన అక్రమాలను ఊరూరా వివరించారు. ఒక దశలో కేసీఆర్ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు పరిధులు దాటాయని భావించిన తెరాస నాయకులు భాజపాపై విరుచుకుపడ్డారు.

జనగామ జిల్లా పాలకుర్తి మండలం దేవరుప్పులలో కాషాయ శ్రేణులపై తెరాస నేతలు దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కొందరు భాజపా నేతలు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news